السبت، 5 مايو 2018

తన దివ్య వచనంలో అల్లా ఇలా సెలవిస్తున్నాడు:

దైవగ్రంధమైన ఖురాను మరియు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారి హదీసు రూపంలో ఉన్న ఇస్లాంను అల్లా మాత్రమే వివరిస్తాడు, ఈ రెండింటిలో తన ఉద్దేశాలను అల్లా మాత్రమే తెలియజేస్తాడు, మనుషులలో ప్రవక్త మహమ్మద్ సల్లల్లాహు అలైహి వస్సల్లామ్ వారి కన్నా ఉత్తమమైన వ్యక్తి ఎవరూ లేరు, అయినప్పటికీ వారు (సల్లల్లాహు అలైహి వసల్లం) తన ప్రభువు తరపున అందిన సందేశాన్ని ప్రజలకు అందించే ఒక ప్రవక్త మాత్రమే.
తన దివ్య వచనంలో అల్లా ఇలా సెలవిస్తున్నాడు:
يَا أَيُّهَا الرَّسُولُ بَلِّغْ مَا أُنزِلَ إِلَيْكَ مِن رَّبِّكَ (المائدة 67)
ఓ ప్రవక్తా! నీవు నీ ప్రభువు తరఫు నుండి నీపై అవతరింపజేయబడిన దానిని తెలియజేయి
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి బాధ్యత సందేశాన్ని అందించడం, చేర్చడం మాత్రమే:
وَمَا عَلَى الرَّسُولِ إِلَّا الْبَلَاغُ الْمُبِينُ (النور 54)
మరియు సందేశహరుని బాధ్యత కేవలం స్పష్టంగా సందేశాన్ని అందజేయటం మాత్రమే
ఈ సందేశాన్ని విశదపరిచే, వివరించే బాధ్యత మాత్రం అల్లాదే, దీని గురించి అల్లా ఇలా సెలవిస్తున్నాడు:
فَإِذَا قَرَأْنَاهُ فَاتَّبِعْ قُرْآنَهُ ثُمَّ إِنَّ عَلَيْنَا بَيَانَهُ (القيامة 18,19)
కావున మేము దీనిని పఠించినప్పుడు నీవు ఆ పారాయణాన్ని శ్రద్ధగా అనుసరించు.ఇక దాని భావాన్ని అర్థమయ్యేలా చేయటం మా బాధ్యతే!
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి సున్నతు (హదీసులు) కూడా అల్లా తరుపున దైవవాణి (వహీ) లో భాగమే.
దీని గురించి అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు ().
وَمَا يَنطِقُ عَنِ الْهَوَى إِنْ هُوَ إِلَّا وَحْيٌ يُوحَى (النجم 3,4)
మరియు అతను తన మనోవాంఛలను అనుసరించి కూడా మాట్లాడడు. అది (అతను పలుకుతున్నది) అతనిపై అవతరింపజేయబడిన దివ్యజ్ఞానం (వహీ) మాత్రమే.
ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారి ఎదుట ఏదైనా ప్రశ్న వస్తే ఇదివరకి వారి ప్రభువు తరపున తెలిసి ఉన్న జ్ఞానం నుండి సమాధానమిస్తారు లేకుంటే దైవవాణి కోసం ఎదురు చూస్తారు తప్పిస్తే స్వతహాగా ఏమీ చెప్పరు.
సహజమైన విషయం ఏమిటంటే ప్రవక్త (సల్లల్లాహు అలైహి వసల్లం) వారిని అత్యంత సమీపంగా వారి సహచరులు అర్ధం చేసుకున్నంతగా మరెవరూ అర్ధం చేసుకోలేరు, కావున ఖురాను యొక్క భావాలను, అర్ధాలను సహాబీలు అర్ధం చేసుకున్నవి మనకు ఆధారాలుగా పరిగణించబడతాయి.
హలాల్, హరామ్ మరియు అన్ని దైవశాసనాలను కేవలం అల్లా మాత్రమే నిర్ణయిస్తాడు, ఆయన మాత్రమే శాసనాలు చేస్తాడు, వీటిలో పూర్తి నిర్ణయాధికారం కేవలం అతనికి మాత్రమే ఉంటుంది, ఎవరైనా ఈ శాసనాదికారాలను ఈ సృష్టిలో మరెవరికైనా ఆపాదిస్తే లేదా ఇతరులు కూడా ఇలాంటి అధికారాలు కలిగి ఉంటారని విశ్వసిస్తే మాత్రం దైవాదేశాలలో ఇతరులను సాటి కల్పించడం, అవిశ్వాసానికి పాల్పడడం అవుతుంది, ఇందులో ఎటువంటి సందేహం లేదు.
అల్లాహ్ తను ఏ అర్ధాన్నైతే కోరుకున్నాడో, ఏ ఉద్దేశాన్నైతే తలచాడో దానినే తన దివ్య గ్రంధంలో
అవతరింపజేశాడు. ఆయన లేదా ఎవరినైతే ఆయన అనుమతించాడో వారు మాత్రమే దీనిని వివరిస్తారు.
ఖురానును అధ్యయనం చేస్తూ దాని అర్ధాన్ని గ్రహించేవారు రెండు షరతులకు లోబడి ఉండవలసి ఉంటుంది.
1. ఖురాను యొక్క పదాలు మరియు వాఖ్యాలలో అరబీ భాష యొక్క మౌలిక భావపరిధి నుండి బయటకు వెళ్లకూడదు.
2. ఖురానులో స్పష్టంగా వివరించబడిన భావానికి వ్యతిరేకంగా అతని అర్ధం ఉండకూడదు.
అల్లా ఇలా పలికాడని ఆపాదించబడే ప్రతీదీ ఆయన చెప్పినది, ఆయన ద్వారా ఉద్దేశించబడినది కాదు. గ్రంధవాసులు (యూధులు, క్రైస్తవులు ) తమ గ్రంధాలలో దానిలో ఉద్దేశింపబడని అర్ధాలలో అతిశయోక్తికి పాల్పడి మార్గభ్రష్టులయ్యారు, చాలా స్పష్టంగా ఉన్న అర్ధాన్ని అస్పష్టంగా ఉన్నట్టు మరియు అస్పష్టంగా ఉన్న అర్ధాన్ని స్పష్టంగా ఉన్నట్టు తమకు అనుగుణంగా వక్రీకరించి అర్ధాలను వివరించారు వారు.
దీని గురించి అల్లా తన గ్రంధంలో ఇలా సెలవిచ్చాడు :
وَإِنَّ مِنْهُمْ لَفَرِيقًا يَلْوُونَ أَلْسِنَتَهُم بِالْكِتَابِ لِتَحْسَبُوهُ مِنَ الْكِتَابِ وَمَا هُوَ مِنَ الْكِتَابِ وَيَقُولُونَ هُوَ مِنْ عِندِ اللَّهِ وَمَا هُوَ مِنْ عِندِ اللَّهِ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ (آل عمران 78)
మరియు వారిలో కొందరు అది గ్రంథం లోనిదని భావించాలని, వాస్తవానికి వారిలో కొందరు తమ నాలుకలను త్రిప్పి గ్రంథాన్ని చదువుతారు, కాని (నిజానికి) అది గ్రంథం లోనిది కాదు; మరియు వారు: "అది అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది." అని అంటారు, కాని అది (నిజానికి) అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది కాదు, మరియు వారు తెలిసి కూడా అల్లాహ్ పై అబద్ధాలు పలుకుతున్నారు.
يَلْوُونَ أَلْسِنَتَهُم بِالْكِتَابِ
వాస్తవానికి వారిలో కొందరు తమ నాలుకలను త్రిప్పి గ్రంథాన్ని చదువుతారు
لِتَحْسَبُوهُ
‘అది గ్రంథంలోని భాగమేనని భావించాలని’
ఈ విధంగా వారు సత్యాన్ని మార్చి మార్గభ్రష్టత కలిగించారు.
Bookmark and Share

ليست هناك تعليقات:

إرسال تعليق