السبت، 5 مايو 2018

అల్లా తన దివ్య గ్రంధంలో ఇలా సెలవిస్తున్నాడు.

ఇస్లాం : ఏకేశ్వరుడైన అల్లా యొక్క ధర్మం ఇస్లాం ధర్మం మాత్రమే, తన సృష్టిలోని మానవులు మరియు జిన్నాతులలో ఈ ధర్మం తప్ప దేనినీ అల్లా స్వీకరించడు.
అల్లా తన దివ్య గ్రంధంలో ఇలా సెలవిస్తున్నాడు.
وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ ( آل عمران 85)
"మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు".
మరో చోట ఇలా సెలవిస్తున్నాడు.
إِنَّ الدِّينَ عِندَ اللَّهِ الْإِسْلَامُ ( آل عمران 19)
నిశ్చయంగా, అల్లాహ్’కు సమ్మతమైన ధర్మం కేవలం అల్లాహ్’కు విధేయులవటం (ఇస్లాం) మాత్రమే
ఇప్పటిదాకా ఈ ప్రపంచంలో వచ్చిన ప్రవక్తలందరూ ఇచ్చిన సందేశం ఇస్లాం మాత్రమే.
దీని గురించి దివ్యా ఖురాన్'లో అల్లా ఇలా సెలవిస్తున్నాడు.
وَمَا أَرْسَلْنَا مِن قَبْلِكَ مِن رَّسُولٍ إِلَّا نُوحِي إِلَيْهِ أَنَّهُ لَا إِلَـهَ إِلَّا أَنَا فَاعْبُدُونِ (الأنبياء 25)
మరియు మేము, నీకు పూర్వం ఏ ప్రవక్తను పంపినా: "నిశ్చయంగా, నేను (అల్లాహ్) తప్ప మరొక ఆరాధ్యుడు లేడు! కావున మీరు నన్నే (అల్లాహ్ నే) ఆరాధించండి." అని దివ్యజ్ఞానం (వహీ) ఇచ్చిపంపాము
మరో చోట ఇలా సెలవిస్తున్నాడు:
إِنَّا أَوْحَيْنَا إِلَيْكَ كَمَا أَوْحَيْنَا إِلَى نُوحٍ وَالنَّبِيِّينَ مِن بَعْدِهِ ۚ وَأَوْحَيْنَا إِلَى إِبْرَاهِيمَ وَإِسْمَاعِيلَ وَإِسْحَاقَ وَيَعْقُوبَ وَالْأَسْبَاطِ وَعِيسَى وَأَيُّوبَ وَيُونُسَ وَهَارُونَ وَسُلَيْمَانَ ۚ وَآتَيْنَا دَاوُودَ زَبُورًا وَرُسُلًا قَدْ قَصَصْنَاهُمْ عَلَيْكَ مِن قَبْلُ وَرُسُلًا لَّمْ نَقْصُصْهُمْ عَلَيْكَ ۚ وَكَلَّمَ اللَّهُ مُوسَى تَكْلِيمًا رُّسُلًا مُّبَشِّرِينَ وَمُنذِرِينَ لِئَلَّا يَكُونَ لِلنَّاسِ عَلَى اللَّهِ حُجَّةٌ بَعْدَ الرُّسُلِ ۚ وَكَانَ اللَّهُ عَزِيزًا حَكِيمًا (النساء 163-165)
(ఓ ప్రవక్తా!) నిశ్చయంగా, మేము నూహ్ కు మరియు అతని తర్వాత వచ్చిన ప్రవక్తలకు సందేశం (వహీ) పంపినట్లు, నీకు కూడా సందేశం పంపాము. మరియు మేము ఇబ్రాహీమ్, ఇస్మాయీల్, ఇస్ హాఖ్, యఅఖూబ్ లకు మరియు అతని సంతతి వారికి మరియు ఈసా, అయ్యూబ్, యూనుస్, హారూన్ మరియు సులైమాన్ లకు కూడా దివ్యజ్ఞానం (వహీ) పంపాము. మరియు మేము దావూద్ కు జబూర్ గ్రంథాన్ని ప్రసాదించాము.
మరియు వాస్తవంగా, మేము పంపిన ప్రవక్తలలో కొందరి గాథలను నీకు తెలిపాము మరియు ఇతర ప్రవక్తలను గురించి మేము నీకు తెలుపలేదు. మరియు అల్లాహ్ మూసాతో నేరుగా మాట్లాడాడు.
(మేము) ప్రవక్తలను శుభవార్తలు ఇచ్చేవారిగా మరియు హెచ్చరికలు చేసే వారిగా పంపాము. ప్రవక్తల (ఆగమనం) తరువాత, అల్లాహ్ కు ప్రతికూలంగా వాదించటానికి, ప్రజలకు ఏ సాకూ మిగల కూడదని! మరియు అల్లాహ్ సర్వ శక్తిమంతుడు, మహా వివేచనాపరుడు.
తన ప్రవక్తలైన నూహ్, ఇబ్రాహీం, ఇస్ హాక్, యాకూబ్, దావూద్, సులైమాన్, అయ్యూబ్, యూసుఫ్, మూసా, హారూన్, జకరియా, యహ్యా, ఈసా, ఇల్యాస్, ఇస్మాయీల్, యసా, యూనుస్, లూత్ అలైహిముస్సలాం వారిని ప్రస్తావించిన పిదప అల్లా ఇలా సెలవిస్తున్నాడు :
أُولَئِكَ الَّذِينَ هَدَى اللَّهُ ۖ فَبِهُدَاهُمُ اقْتَدِهْ (الأنعام 90)
ఇలాంటి వారే అల్లాహ్ మార్గదర్శకత్వం పొందినవారు. కావున నీవు వారి మార్గాన్నే అనుసరించు. వారితో ఇలా అను: "నేను దీనికి బదులుగా మీ నుంచి ఎలాంటి ప్రతిఫలాన్ని అడగను. ఇది కేవలం సర్వ లోకాల (వారి) కొరకు ఒక హితోపదేశం మాత్రమే."
మౌలికంగా ప్రవక్తలందరి ధర్మ సందేశం ఒక్కటే, వ్యత్యాసం ఏమైనా ఉంటే కొన్ని పాక్షిక విషయాలలో మాత్రమే ఉంటుంది, ఇది తప్ప మౌలికంగా దాని "అసలు" మాత్రం మారదు.
బనీ ఇస్రాయీల్ జాతిలో అల్లా తన ప్రవక్త మూసా మరియు ప్రవక్త ఈసా ఇరువురినీ పంపించాడు. ప్రవక్త ఈసా వారిపై అవతరించిన ఇంజీల్ గ్రంధం ప్రవక్త మూసా వారి పై అవతరించిన తౌరాత్ గ్రంధంలోని కొన్ని అంశాలను రద్ధు చేసింది.
ప్రవక్త ఈసా () వారు తన జాతి వారికి ఇలా తెలియజేశారు :
وَمُصَدِّقًا لِّمَا بَيْنَ يَدَيَّ مِنَ التَّوْرَاةِ وَلِأُحِلَّ لَكُم بَعْضَ الَّذِي حُرِّمَ عَلَيْكُمْ ۚ وَجِئْتُكُم بِآيَةٍ مِّن رَّبِّكُمْ فَاتَّقُوا اللَّهَ وَأَطِيعُونِ (آل عمران 50)
" మరియు నేను, ప్రస్తుతం తౌరాత్’లో (మిగిలి ఉన్న సత్యాన్ని) ధృవ పరచటానికి మరియు పూర్వం మీకు నిషేధించబడిన (హరామ్ చేయబడిన) కొన్ని వస్తువులను ధర్మసమ్మతం (హలాల్) చేయటానికి (వచ్చాను). మరియు నేను మీ ప్రభువు తరఫు నుండి మీ వద్దకు అద్భుత సూచనలు (ఆయాత్) తీసుకొని వచ్చాను, కావున మీరు అల్లాహ్ యందు భయభక్తులు కలిగి ఉండండి మరియు నన్ను అనుసరించండి
ప్రవక్త మూసా మరియు ఈసా (అలైహిముస్సలమ్) వారు ఒకే జాతిలో పంపబడినప్పటికీ కొన్ని శాసనాలలో మనకు మార్పులు కనిపిస్తాయి, ఒకే జాతికి చెందిన ప్రవక్తలలోని స్యాసనాలలో మార్పు కనిపిస్తున్నప్పుడు పూర్తిగా జాతికి జాతే మారిపోతున్నప్పుడు సంభవించే మార్పుల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.
కాలక్రమంలో కొందరు తమకు ఇష్టమొచ్చినట్లుగా దైవశాసనాలలో (షరీయత్)లో మార్పులు, చేర్పులు చేసేశారు, చివరికి అవి మెల్లిమెల్లిగా తమ అసలు స్వరూపాన్ని కోల్పోయాయి.
దీని గురించే అల్లా ఇలా ప్రస్తావిస్తున్నాడు :
وَإِنَّ مِنْهُمْ لَفَرِيقًا يَلْوُونَ أَلْسِنَتَهُم بِالْكِتَابِ لِتَحْسَبُوهُ مِنَ الْكِتَابِ وَمَا هُوَ مِنَ الْكِتَابِ وَيَقُولُونَ هُوَ مِنْ عِندِ اللَّهِ وَمَا هُوَ مِنْ عِندِ اللَّهِ وَيَقُولُونَ عَلَى اللَّهِ الْكَذِبَ وَهُمْ يَعْلَمُونَ (آل عمران 78)
మరియు అది గ్రంథం లోనిదని భావించాలని వాస్తవానికి వారిలో కొందరు తమ నాలుకలను త్రిప్పి గ్రంథాన్ని చదువుతారు, కాని (నిజానికి) అది గ్రంథం లోనిది కాదు; మరియు వారు: "అది అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది." అని అంటారు, కాని అది (నిజానికి) అల్లాహ్ దగ్గర నుండి వచ్చింది కాదు, మరియు వారు తెలిసి కూడా అల్లాహ్ పై అబద్ధాలు పలుకుతున్నారు
మరో చోట అల్లా ఇలా సెలవిస్తున్నాడు:
يُحَرِّفُونَ الْكَلِمَ عَنْ مَوَاضِعِهِ
పదాలను వాటి సంధార్భాల నుండి తారుమారు చేసి చేయడం.
ఈ మార్పులూ , చేర్పులు ప్రజలకు మరియు సత్యానికి మధ్య పెద్ద అవరోధాన్ని సృష్టించింది, అసలు యదార్ధం కప్పివేయబడింది, దీనిని సరిదిద్దాడానికి ధర్మాన్ని మరలా అవతరింపజేయాలని సర్వ సృష్టికర్త అయిన అల్లా తలచాడు, దీనికోసం ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఎన్నుకున్నాడు, ఇదివరకి లేని కొత్త ధర్మాన్ని అల్లా ప్రవక్త ముహమ్మద్ () వారిపై అవతరింపజేయలేదు, ఆది కాలం నుండి ప్రవక్తలందరికీ అందిస్తూ వచ్చిన ఇస్లాంనే అల్లా ప్రవక్త ముహమ్మద్ () వారికీ అందించాడు, ఏ కాలంలోనూ అల్లా ఇస్లాం తప్ప మరే ధర్మాన్ని అంగీకరించడు.
وَمَن يَبْتَغِ غَيْرَ الْإِسْلَامِ دِينًا فَلَن يُقْبَلَ مِنْهُ وَهُوَ فِي الْآخِرَةِ مِنَ الْخَاسِرِينَ (آل عمران 85)
మరియు ఎవడైనా అల్లాహ్ కు విధేయత (ఇస్లాం) తప్ప ఇతర ధర్మాన్ని అవలంబించగోరితే అది ఏ మాత్రమూ స్వీకరించబడదు మరియు అతడు పరలోకంలో నష్టపడేవారిలో చేరుతాడు
మానవులు, జిన్నాతులు , అరబ్బులు, అరబ్బేతరులు అందరివైపు ముహమ్మద్ (స)వారిని ప్రవక్తగా చేసి పంపించాడు ఆ సర్వసృష్టికర్త.
وَمَا أَرْسَلْنَاكَ إِلَّا كَافَّةً لِّلنَّاسِ بَشِيرًا وَنَذِيرًا (سبأ 28)
మరియు (ఓ ముహమ్మద్!) మేము నిన్ను సర్వమానవులకు శుభవార్తనిచ్చే వానిగా మరియు హెచ్చరిక చేసేవానిగా మాత్రమే పంపాము.
وَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِ
هِ، لاَ يَسْمَعُ بِي أحد من هذه الأمة لا يَهُودِيٌّ، وَلاَ نَصْرَانِيٌّ، ثُمَّ يَمُوتُ وَلَمْ يُؤْمِنْ بِالَّذِي أُرْسِلْتُ بِهِ إِلاَّ كانَ مِنْ أَصْحَابِ النار (مسلم 153)
సహీ హదీసులో అబూ హురైరా (ర) వారు ఇలా ఉల్లేఖిస్తున్నారు : ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఇలా సెలవిచ్చారు : “ఎవరి చేతిలో అయితే ఈ ముహమ్మద్ ప్రాణం ఉందో ఆయన పై ప్రమాణం చేసి చెబుతున్నాను, ఈ ఉమ్మత్'లో ఏ ఒక్క యూదుడు కానీ, క్రైస్తవుడు కానీ నాకు పంపబడిన ఈ సందేశాన్ని గ్రహించి దానిని విశ్వసించకపోతే ఖచ్చితంగా నరకవాసులలో చేరతాడు. (ముస్లిం)
అల్లా ఖురాన్'ను ఎటువంటి మార్పులు చేర్పులు లేకుండా కాపాడాడు, అల్లా తన దివ్య వచనంలో ఇలా సెలవిచ్చాడు:
إِنَّا نَحْنُ نَزَّلْنَا الذِّكْرَ وَإِنَّا لَهُ لَحَافِظُونَ (الحجر 9 )
నిశ్చయంగా మేమే ఈ జ్ఞాపిక(ఖురాన్)ను అవతరింపచేసాము మరియు నిశ్చయంగా మేమే దీనిని కాపాడేవారము.

ليست هناك تعليقات:

إرسال تعليق