الثلاثاء، 22 مايو 2018

క్లుప్తంగా అఖీదా యొక్క వివరణ.

క్లుప్తంగా అఖీదా యొక్క వివరణ.
దాసులపై అల్లా యొక్క హక్కు గురించి అల్లా తన ప్రవక్తఅయిన నూహ్, ఆ తరువాత వచ్చిన ప్రవక్తలందరికీ అలాగే చిట్టచివరి ప్రవక్త అయిన ముహమ్మద్ () వారికి తన సందేశాన్ని ఇచ్చి ఉన్నాడు, దీని గురించి వారికి తాకీదు చేసి ఉన్నాడు. అల్లా యొక్క ఈ హక్కుల గురించి దాసుడు తీర్పు దినాన ప్రశ్నించబడతాడు. వీటి సమాధానాల గురించి కొన్ని అంశాలు మరియు అకీదాకు సంబందించిన కొన్ని ముఖ్య వివరణలు.
شَرَعَ لَكُمْ مِنَ الدِّينِ مَا وَصَّىٰ بِهِ نُوحًا وَالَّذِي أَوْحَيْنَا إِلَيْكَ وَمَا وَصَّيْنَا بِهِ إِبْرَاهِيمَ وَمُوسَىٰ وَعِيسَىٰ ۖ أَنْ أَقِيمُوا الدِّينَ وَلَا تَتَفَرَّقُوا فِيهِ
ఆయన నూహ్’కు విధించిన (ఇస్లాం) ధర్మాన్నే మీ కొరకు విధి చేశాడు మరియు దానినే (ఓ మహమ్మద్) మీము నీకు దివ్యజ్ఞానం(వహీ) ద్వారా అవతరింపజేశాము మరియు మేము దానినే ఇబ్రాహీం, మూసా మరియు ఈసాలకు కూడా విధి చేశాము. ఈ ధర్మాన్నే అవలంబించాలని మరియు దీనిలో ఒకరికొకరు విడిపోకుండా ఉండాలని ఆజ్ఞాపించాము.
స్వార్ధాలు, దురాశలు, పెరిగే కొద్దీ ఆధారాలు, యదార్ధాలతో సంబందం లేని ఇష్టానుసార భిన్న ఆలోచనలు రూపుదిద్దుకుంటాయి. భిన్న ఆలోచనలు పెరిగే కొద్ది భిన్న వర్గాలు, గ్రూపులు పుట్టుకొస్తాయి. మాతృభాష అరబీ కలిగిన అరబ్బులు లేదా ఇతరుల ఈ అరబీ భాష బలహీన పడినప్పుడు అసలు అర్ధాలు మారడం, సందేహాస్పద భావాలు పుట్టుకురావడం జరుగుతుంది.
ఆ తరువాత ఈ తప్పుడు భావాలను, అర్ధాలను నిరూపించడానికి ప్రయత్నం జరుగుతుంది, అలాగే ఖురాను ఆయతులు మరియు ప్రవక్త హదీసులలో బుద్ధికి అర్ధమయ్యే అర్ధాలను, హేతుబద్ధ భావాలను మాత్రమే నిరూపించడానికి ప్రయత్నించడం జరుగుతుంది. మొదట్లో ఒక వర్గం అనేది రూపాంతం చెందడం సంభవం అయినప్పుడు ఆ తరువాతివారికి అలాంటివి ఏర్పరచడం మరింత తేలికైపోతుంది.
వాస్తవానికి సందేహంలోనే ఒక స్వార్ధపూరిత కోరిక ఉంటుంది, ఆ కొరికే తరువాత ఒక సందేహంగా రూపాంతం చెంది ఆ తరువాత ఒక నూతన సిద్ధాంతంగా, ఒక క్రొత్త అభిమతంగా మారుతుంది, తరువాత జనాలు రూపాంతం చెందిన ఈ చివరి స్థితిని తీసుకుంటారు కానీ దీని మొదటి మరియు అసలు స్థితి గురించి వారికి తెలిసి ఉండదు.

ليست هناك تعليقات:

إرسال تعليق